
రాజానగరం: ప్రజల సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలి
రాజానగరం మండలం దివాన్ చెరువులో బుధవారం రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ 'మన ఊరు - మన ఎమ్మెల్యే - మన పల్లెబాట' కార్యక్రమంలో భాగంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలోని ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజల బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలను వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించాలని ఆదేశించారు.



































