చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను బొమ్మూరు పోలీసులు అరెస్టు చేసినట్లు శనివారం వివరాలు వెల్లడించారు. ఈనెల 24న రాజానగరం మండలం దివాన్చెరువుకి చెందిన కె. అవినాష్ కాశీ వెళ్లి 27న తిరిగి వచ్చేసరికి చోరీ జరగడంతో బొమ్మూరు పోలీసు లకు ఫిర్యాదు చేశారు. నిందితులు భువనేశ్వర్కు చెందిన ప్రశాంత్ కుమార్(35), సాగర్కుమార్ పాండా (34)లను లాలా చెరువు చెరువు హౌసింగ్ బోర్డు వద్ద అరెస్టు చేసి రూ.4.21 లక్షల నగదు, రూ.5.77 లక్షల విలువైన బంగారం, ప్లాటినం ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. కాగా ఈ నిందితుల పై పలు రాష్ట్రాల్లో 56 కేసులు ఉన్నాయ్.