రాజానగరం మండలం నామవరం డి-బ్లాక్‌లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని కలెక్టర్ కీర్తి చేకూరి మంగళవారం తనిఖీ చేశారు. వర్షాలు, తుపాను ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలను సురక్షిత ప్రదేశాలకు తరలించి ఏర్పాటు చేసిన వసతులను ఆమె పరిశీలించారు. కేంద్రంలో తాగునీరు, ఆహారం, విద్యుత్, వైద్య సదుపాయాలు, పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించి సంబంధిత అధికారులకు తగిన సూచనలు ఇచ్చారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.