పారిశుద్ధ్య లోపంపై కమిషనర్ కన్నెర్ర

2చూసినవారు
పారిశుద్ధ్య లోపంపై కమిషనర్ కన్నెర్ర
రాజానగరం మండలం దివాన్ చెరువు పంచాయతీ పరిధిలో గురువారం నగర కమిషనర్ రాహుల్ మీనా, అసిస్టెంట్ కలెక్టర్ క్షితిజ్ ఆదిత్య శర్మ పర్యటించారు. త్రాగునీరు, పారిశుద్ధ్యం, డ్రెయిన్ల పూడికతీత లేకపోవడం వంటి సమస్యలపై గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. పారిశుద్ధ్యంలో నిర్లక్ష్యం సహించబోమని, మురుగు నీరు రోడ్లపైకి వచ్చి ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోందని కమిషనర్ అధికారులను హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్