కోరుకొండ మండల పరిషత్ కార్యాలయంలో ఈఓపీఆర్డీగా పనిచేసి, బుధవారం పదవీ విరమణ చేస్తున్న బుడిద మహేశ్వర ప్రతాప్ కు ఘనంగా వీడ్కోలు పలికారు. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై, మహేశ్వర ప్రతాప్, ఆయన సతీమణిని దుశ్శాలువాతో సత్కరించారు. ప్రభుత్వ సేవలో ప్రజలకు, మండల అభివృద్ధికి ఆయన చేసిన సేవలను ఎమ్మెల్యే కొనియాడారు.