రాజమండ్రిలోని మోడల్ కెరీర్ సెంటర్ జిల్లా ఉపాధి కార్యాలయం వద్ద ఈనెల 31వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి సి. హెచ్. శిరీష మంగళవారం తెలిపారు. ఈ మేళాలో పాల్గొనాలనుకునే ఆసక్తి గల పురుషులు, మహిళలు తమ విద్యార్హతల సర్టిఫికెట్లు, బయోడేటా, జిరాక్స్ కాపీలతో హాజరుకావాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం 9533221189 నంబర్‌ను సంప్రదించవచ్చని తెలిపారు.