రాజానగరం మండలం హౌసింగ్ బోర్డు కాలనీలో శుక్రవారం జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పాల్గొన్నారు. డయాలసిస్‌తో బాధపడుతున్న సరళ గంగాభవానికి రూ. 10,000/- పెన్షన్ అందజేశారు. రాష్ట్రంలో పింఛన్ల పంపిణీని ఏపీ ప్రభుత్వం పండుగలా నిర్వహిస్తోందని, కొత్త పింఛన్ల మంజూరులో కీలక మార్పులు తెచ్చి లబ్ధిదారులకు త్వరితగతిన అందేలా చేస్తున్నామని, అంకితభావం, నిబద్ధత ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికే సొంతమని ఎమ్మెల్యే తెలిపారు.