DGP హరీష్ కుమార్ గుప్తాను కలిసిన MLA బత్తుల

12చూసినవారు
DGP హరీష్ కుమార్ గుప్తాను కలిసిన MLA బత్తుల
రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మంగళవారం ఏపీ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) హరీష్ కుమార్ గుప్తాను వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని సీతానగరం, కోరుకొండ పోలీస్ స్టేషన్లు, కోరుకొండ సర్కిల్ కార్యాలయాలకు కొత్త భవనాలు నిర్మించాలని, పోలీస్ స్టేషన్లకు కొత్త వాహనాలను మంజూరు చేయాలని ఆయన డీజీపీని కోరారు. ఈ అభ్యర్థనలపై డీజీపీ సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

ట్యాగ్స్ :