రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, కోరుకొండ మండలంలో టీటీడీ శ్రీవాణి ట్రస్టు పథకం కింద నూతనంగా నిర్మిస్తున్న ఆలయాలకు మంజూరైన చెక్కులను ఆలయ కమిటీ సభ్యులకు శనివారం అందజేశారు. మధురపూడిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి రూ. 4,84,736, పాత మునగాలలోని శ్రీ విగ్నేశ్వర స్వామి ఆలయానికి రూ. 3,17,03, కొత్త మునగాలలోని శ్రీ విగ్నేశ్వర ఆలయానికి రూ. 3,34,000 మంజూరైనట్లు తెలిపారు.