రాజమండ్రిలో మంగళవారం, ఎమ్మెల్సీ సోము వీర్రాజు సీఎం సహాయనిధి ద్వారా వైద్య చికిత్సల నిమిత్తం రూ. 15 లక్షల విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. దిగువ తరగతి కుటుంబాలు వైద్య ఖర్చులతో ఇబ్బందులు పడుతున్నాయని, ఈ ఆర్థిక సహాయం వారికి ఎంతో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తీగిరెడ్డి దుర్గాభవాని, పైల నూకరాజు, పీర్ ముఖార్జా షేక్, బోడేటి ప్రమోద్ కుమార్ పాల్గొన్నారు.