రాజానగరం: PMAY-G పథకానికి దరఖాస్తు గడువు పెంపు

12చూసినవారు
రాజానగరం: PMAY-G పథకానికి దరఖాస్తు గడువు పెంపు
నవంబర్ 30తో ముగిసిన ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ-ఎన్టీఆర్ పథకం దరఖాస్తు గడువును ప్రభుత్వం డిసెంబర్ 14 వరకు పొడిగించింది. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ బుధవారం ఈ విషయాన్ని తెలిపారు. సొంత ఇల్లు లేని కుటుంబాలకు గృహ నిర్మాణం కోసం రూ. 2.50 లక్షల వరకు ఆర్థిక సహాయం, స్థలం లేని వారికి 3 సెంట్ల స్థలం ప్రభుత్వం అందజేయనుంది. దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు సచివాలయాలను సంప్రదించవచ్చు.

సంబంధిత పోస్ట్