మంగళవారం తాడేపల్లిలో ఏపీ రాష్ట్ర పంచాయతీ రాజ్ కమిషనర్ కృష్ణ తేజను రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించి, వినతి పత్రాలు అందజేశారు. ముఖ్యంగా, పుష్కరాలకు రాజానగరం నియోజకవర్గంలో కీలకమైన రోడ్ల అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే కోరారు. పుష్కరాలకు సంబంధించి రాజానగరం ఒక కీలక ప్రాంతమని ఆయన తెలిపారు.