సీతానగరం నుంచి రాజమండ్రి వెళ్లే ప్రధాన రహదారిపై మంగళవారం ఒక కారు ప్రమాదానికి గురైంది. రాజంపేట వద్దకు రాగానే ఇసుక రేవు నుంచి అకస్మాత్తుగా ఎదురుగా వచ్చిన లారీని తప్పించబోయి కారు అదుపుతప్పి రోడ్డు డివైడర్‌ను ఎక్కింది. ఈ ప్రమాదంలో కారులోని వారికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో రహదారిపై కొద్దిసేపు వాహనాల రద్దీ ఏర్పడింది.