సీతానగరం: రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ పండగలా నిర్వహిస్తున్నాం

7చూసినవారు
సీతానగరం: రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ పండగలా నిర్వహిస్తున్నాం
సీతానగరం మండలం బొబ్బిలంకలో సోమవారం జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పాల్గొన్నారు. ఆయన లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లు అందజేశారు. రాష్ట్రంలో పింఛన్ల పంపిణీని ప్రభుత్వం ఒక పండుగలా నిర్వహిస్తోందని, కొత్తగా పెన్షన్ మంజూరు విధానంలో కీలక మార్పులు చేసి లబ్ధిదారులకు సకాలంలో పింఛన్లు అందేలా చూస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్