సీతానగరం మండలంలోని బొబ్బిల్లంక, ములకల్లంక, కాటవరం గ్రామాల్లో గోదావరి నదీ తీరం కోతకు గురవుతోంది. వందలాది ఎకరాల పంట భూములు నదిలో కలిసిపోతుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వరదల సమయంలో నష్టం మరింత పెరిగే అవకాశం ఉందని, తమ భూములను కాపాడటానికి తక్షణమే రివిట్‌మెంట్ పనులు చేపట్టాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సాగు భూములు కోల్పోవడంతో జీవనోపాధి దెబ్బతింటుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.