రాజానగరం మండలం హౌసింగ్ బోర్డ్ కాలనీలో గురువారం రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో జనవాణి - ప్రజాదర్బార్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రజల నుంచి 54 అర్జీలను స్వీకరించారు. వారి సమస్యలను వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేసి పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఆయన తెలిపారు.