గ్రామీణ విద్యార్థుల సత్తా.. రాజానగరం MLA ప్రశంసలు!

7చూసినవారు
గ్రామీణ విద్యార్థుల సత్తా.. రాజానగరం MLA ప్రశంసలు!
దివాన్ చెరువుకు చెందిన విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో ఘన విజయం సాధించారు. జలగం దిలేఖ్య (592), యర్రంశెట్టి సితార (587), పంచికట్ల తేజస్వి (584) అత్యుత్తమ మార్కులు సాధించగా.. రాజానగరం MLA బత్తుల బలరామకృష్ణ బుధవారం వారిని అభినందించి, సత్కరించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో రాణించడం గర్వకారణమని MLA కొనియాడారు. విద్యార్థుల భవిష్యత్తుకు తన వంతు సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్