రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం సాయంత్రం 'యూత్ కనెక్ట్' కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో యువతకు మత్తు పదార్థాల దుష్ప్రభావాలు, చట్టపరమైన శిక్షలు, సైబర్ నేరాలు, ఈవ్ టీజింగ్, బెట్టింగ్ వంటి నేరాల ప్రమాదాలపై అవగాహన కల్పించారు. మంచి విద్య, ఉపాధి అవకాశాల ప్రాముఖ్యతను కూడా వివరించారు.