ద్రాక్షారామ: ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వృద్ధుడి మరణం

5చూసినవారు
ద్రాక్షారామ: ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వృద్ధుడి మరణం
ద్రాక్షారామ బస్టాండు ఆవరణలో నివాసముంటున్న సుమారు 55 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందినట్లు ఎస్సై ఎం. లక్ష్మణ్ తెలిపారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అతడిని రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ గురువారం మరణించారు. మృతుడికి సంబంధించిన ఇతర వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్