ద్రాక్షారామలోని శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానాన్ని మంగళవారం ఉదయం 8 గంటలకు చంద్రగ్రహణం పురస్కరించుకుని మూసివేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి వెంకట దుర్గా భవాని తెలిపిన వివరాల ప్రకారం, నిత్య కైంకర్యాలు, భక్తుల దర్శనాలు పూర్తయిన తర్వాత ఆలయ ద్వారాలు మూసివేశారు. గ్రహణ దోష నివారణ కోసం బుధవారం ఉదయం ప్రత్యేక సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించి, అనంతరం స్వామివారి దర్శనం యథావిధిగా కల్పిస్తామని ఆమె తెలిపారు. భక్తులు ఈ సమయ మార్పును గమనించి సహకరించాలని కోరారు.