రామచంద్రపురం మండలం వేగాయమ్మపేటలో విద్యుత్ స్తంభానికి అల్లుకున్న తీగ మొక్కల వల్ల స్థానికులు ఆందోళన చెందుతున్నారు. బుధవారం వారు ఈ సమస్యను వెలుగులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూట్ వంటి ప్రమాదాలు జరిగి ప్రయాణికులకు హాని కలిగే అవకాశం ఉందని గ్రామస్తులు పేర్కొన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకముందే విద్యుత్ శాఖ అధికారులు స్పందించి, తీగ మొక్కలను తొలగించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.