కోనసీమలో ప్రశాంతంగా పాలిసెట్: 93. 3 శాతం హాజరు నమోదు

7చూసినవారు
డాక్టర్ బి. ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో శనివారం పాలిసెట్-2026 ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లా కోఆర్డినేటర్ కొండారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, జిల్లావ్యాప్తంగా 15 కేంద్రాలలో 5,711 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా, 5,331 మంది (93.3%) పరీక్ష రాశారు. అమలాపురం, మండపేట, రామచంద్రపురం, ముక్తేశ్వరంలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. అధికారులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you