కోటిపల్లి 33/11 కేవీ విద్యుత్ సబ్-స్టేషన్‌లో వార్షిక నిర్వహణ పనుల కారణంగా బుధవారం ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. విద్యుత్ శాఖ అధికారి రత్నాలరావు తెలిపిన వివరాల ప్రకారం, ఈ నిలుపుదల వల్ల కోటిపల్లి, కోట, సుందరపల్లి, ఊడిమూడి, మల్లవరం, తమ్మయపాలెం గ్రామాలకు విద్యుత్ అందదు. వినియోగదారులు ఈ అంతరాయాన్ని గమనించి సహకరించాలని కోరారు.