రామచంద్రాపురం: ఉత్సాహంగా 'వేసవినోద శిబిరం'

12చూసినవారు
రామచంద్రపురం రత్నంపేట మున్సిపల్ హైస్కూల్లో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవినోద శిబిరం ఆహ్లాదకరంగా సాగుతోంది. ఆదివారం చిన్నారులకు అబాకస్‌తో పాటు భౌతిక, రసాయన శాస్త్ర అంశాలపై సరళమైన రీతిలో శిక్షణ ఇచ్చినట్లు జిల్లా కార్యదర్శి పి. నరసింహారావు తెలిపారు. విద్యార్థుల్లో విజ్ఞానాన్ని పెంచేలా జరుగుతున్న ఈ కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు మాచిరాజు, సత్యనారాయణ, సైన్స్ ఉపాధ్యాయులు బ్రహ్మానందం, శిరీషారాణి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్