రామచంద్రపురం పట్టణంలో పదేళ్ల బాలిక రంజిత (హనీ) ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. తల్లి సునీత కాకినాడలో ఉండటంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలిక ఈ దారుణానికి పాల్పడింది. స్థానికుల సహాయంతో తలుపులు తెరిచి చూడగా, బాలిక ఉరివేసుకున్న స్థితిలో కనిపించింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు, బాలిక మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని పేర్కొన్నారు.