రామచంద్రపురం: రహదారి ప్రమాదంలో వ్యక్తి మృతి

4చూసినవారు
రామచంద్రపురం: రహదారి ప్రమాదంలో వ్యక్తి మృతి
రామచంద్రపురం మండలం వెల్ల-ద్రాక్షారామ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మట్టి లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో బి. సూర్య వీరవెంకటనాగ కృష్ణామూర్తి (46) అక్కడికక్కడే మృతి చెందారు. ఆయన భార్య భవానికి గాయాలవడంతో కాకినాడ జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ద్రాక్షారామ ఎస్ఐ లక్ష్మణ్ తెలిపారు. రహదారులపై ఇష్టారాజ్యంగా తిరుగుతున్న మట్టి ట్రాక్టర్లను నియంత్రించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్