రామచంద్రపురం: కోటిపల్లి వద్ద గౌతమీ గోదావరిపై వంతెన నిర్మించాలని కోరుతూ 'వారధి సాధన కమిటీ' సభ్యులు మంగళవారం అద్దంపల్లి, అయితపూడి గ్రామ సర్పంచులకు వినతిపత్రాలు అందజేశారు. వంతెన నిర్మాణానికి మద్దతుగా ఆయా పంచాయతీల్లో తీర్మానాలు చేయాలని వారు కోరగా, సర్పంచులు సానుకూలంగా స్పందించి పూర్తి హామీ ఇచ్చారు. దశాబ్దాల నాటి ఈ ప్రాంత ప్రజల కలను నెరవేర్చేందుకు ప్రజాప్రతినిధుల మద్దతు కూడగడుతున్నామని కమిటీ సభ్యులు స్వామి నాయుడు, ఆకేటి కృష్ణ తెలిపారు.