తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో తాళ్లపూడి MPDO కార్యాలయంలో మండల పంచాయతీ సెక్రటరీలు, స్పెషల్ ఆఫీసర్లు, పలు శాఖల అధికారులతో ఎమ్మెల్యే ముప్పిడివెంకటేశ్వరరావు అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన ప్రతి గ్రామ పంచాయతీలో తగినన్ని వీధి దీపాలు ఏర్పాటు చేయాలని, గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని కచ్చితంగా నిర్వహించాలని, ప్రజలకు మంచినీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్వచ్ఛ ఆంధ్ర - స్వచ్ఛ దివాస్ గా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ సమావేశం 2026 ఏప్రిల్ 27న జరిగింది.