రామచంద్రపురం రత్నంపేట మునిసిపల్ హైస్కూల్లో గురువారం నిర్వహించిన వేసవి వినోద కార్యక్రమం విద్యార్థులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ శిబిరంలో గణితంలోని కీలక అంశాలను సులభంగా అర్థమయ్యే రీతిలో బోధించారు. పట్టణ పరిధిలోని విద్యార్థులు ప్రతిరోజూ ఉత్సాహంగా హాజరవుతున్నారని జనవిజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శి పెదపాటి నరసింహారావు తెలిపారు. ఈ కార్యక్రమం విద్యార్థులకు గణితంపై ఆసక్తిని పెంచింది.