కోనసీమ కలెక్టర్ మహేష్ కుమార్, భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా చేపట్టిన 'జలధార' పనులను పారదర్శకంగా పూర్తి చేయాలని అధికారులను శుక్రవారం ఆదేశించారు. జిల్లాలోని 45 గ్రామాల్లో చెరువులు, కుంటల రీఛార్జ్ పనులతో పాటు అంతర్వేది, అమలాపురం ఆలయ కోనేర్ల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఉప్పలగుప్తం డ్రైయిన్ల వెంబడి ఉన్న ఆక్రమణలను తొలగించాలని, నీటి పొదుపుపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.