రామచంద్రపురంలో వైసీపీ రైతు ర్యాలీ

6చూసినవారు
రామచంద్రపురంలో వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాశ్ ఆధ్వర్యంలో గురువారం రైతులు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని, రైతుల ఇబ్బందులను తక్షణమే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు వైసీపీ అండగా ఉండి పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ రైతులు, వైసీపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్