
లబ్బర్తిలో ఇంటింటా తెలుగుదేశం.. ఎమ్మెల్యే
రాజవొమ్మంగి మండలం లబ్బర్తి, సీతారామపురం గ్రామాల్లో శనివారం “రెండేళ్ల నమ్మకం–సంక్షేమం–అభివృద్ధి” ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్పర్సన్, ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం పారదర్శక పాలనతో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు.








































