ఉండ్రాజవరం మండలం పసలపూడికి చెందిన యువర్స్ బిసర్వేంట్స్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకుడు చీపుళ్ళ విజయ్‌కు కర్మవీర్ చక్ర అవార్డు లభించింది. ఐక్యరాజ్యసమితి సహకారంతో వివిధ సేవా కార్యక్రమాల్లో అందించిన సేవలకు గాను ఈ అవార్డును ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో అందజేస్తారు. విజయ్ తన సంస్థ ద్వారా 50 వేల మందికి పైగా రక్తదానం, లక్ష మందికి పైగా ఆహారదానం, వీల్ చైర్స్ అందజేత వంటి కార్యక్రమాలను నిర్వహించారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ అవార్డును అందుకున్నారు. ఇలాంటి పురస్కారాలు తనకు మరింత స్ఫూర్తినిస్తాయని విజయ్ తెలిపారు. ఈ సందర్భంగా పసలపూడి గ్రామస్తులు విజయోత్సవాలు జరుపుకున్నారు.