అల్లూరి జిల్లాలోని డుంబ్రిగుడ మండలం బిల్లాపుట్టు గ్రామంలో ఆదివారం ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమంలో భాగంగా ఆయన సంతకాలు సేకరించారు. ప్రైవేటీకరణ పేద విద్యార్థుల విద్యా అవకాశాలను దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్న ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.