వికలాంగుల దినోత్సవం: చిన్నారుల ప్రదర్శన, బహుమతుల ప్రదానం

554చూసినవారు
వికలాంగుల దినోత్సవం: చిన్నారుల ప్రదర్శన, బహుమతుల ప్రదానం
దుద్దుకూరు భవిత పాఠశాలలో మంగళవారం ది సర్వ్ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రపంచ వికలాంగుల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంఈఓ-2 అప్పారావు మాట్లాడుతూ, వైకల్యం అనేది ప్రయత్నానికి, ప్రయోగానికి, విజయానికి అడ్డు కాకూడదని అన్నారు. ఈ సందర్భంగా చిన్నారుల వేషధారణలు ఆకట్టుకోగా, చక్కటి ప్రదర్శన చేసిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ-2 అప్పారావు, డాక్టర్ సుమంత్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్