దేవీపట్నం: వరదతో గండి పోచమ్మ ఆలయంలో దర్శనాలు నిలిపివేత

68చూసినవారు
అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలంలోని గండి పోచమ్మ ఆలయంలోకి వరద నీరు ప్రవహించడంతో అమ్మవారి విగ్రహం నడుము వరకు మునిగిపోయింది. పోలవరం కాఫర్ డ్యాం వద్ద భారీగా చేరుతున్న వరద నీటి ప్రభావంతో ఆదివారం నుండి ఆలయంలో దర్శనాలు తాత్కాలికంగా నిలిపివేశామని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్