రాజవొమ్మంగి మండలంలో ఉపాధి హామీ పథకం కింద జలధార పనులను వేగవంతం చేయాలని ఎంపిడిఓ లోకుల యాదగిరేశ్వరరావు బుధవారం ఆదేశించారు. మండల పరిషత్ కార్యాలయంలో క్షేత్రస్థాయి సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ సూచనలు చేశారు. వేతనదారుల సంఖ్యను పెంచాలని కూడా ఆయన కోరారు. ఈ సమావేశంలో ఏ.పి ఓ శ్రీనివాస్, ఆర్. డబ్ల్యూ ఎస్. జె. ఈ సీతారామయ్య, టి. ఏ లు పాల్గొన్నారు.