రంపచోడవరం నియోజకవర్గం మారేడుమిల్లి మండలం పాములేరు గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చదల లక్ష్మి ఇంటిని ఇటీవల గాలివాన వల్ల పడిపోయిన చెట్టు దెబ్బతినడంతో, మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి ఆమె ఇంటికి వెళ్లి పరామర్శించి, ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సత్తి సత్యనారాయణ రెడ్డి, జడ్పిటిసి గొర్లె బాలాజీ బాబు, ఆర్టిఐ అధ్యక్షులు అనిల్ ప్రసాద్, కార్యదర్శి గంగరాజు, కోఆప్షన్ ధర్మ, బూత్ కమిటీ ప్రెసిడెంట్ నల్లమిల్లి సుబ్బారెడ్డి, నాయకులు బలుసుమిల్లి చంటి, విక్టర్ బన్ను, సురేష్ గౌడ్ పాల్గొన్నారు.