మారేడుమిల్లి స్కూల్లో మెగా పి టి ఎం 3.0: విద్యార్థులకు ఉన్నత శిఖరాల ఆకాంక్ష

1243చూసినవారు
మారేడుమిల్లి స్కూల్లో మెగా పి టి ఎం 3.0: విద్యార్థులకు ఉన్నత శిఖరాల ఆకాంక్ష
మారేడుమిల్లి మండల ప్రజా పరిషత్ స్కూల్లో శుక్రవారం మెగా పి టి ఎం 3.0 సమావేశం హెడ్ మాస్టర్ అందాల వీణ దేవి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఎంపీపీ సార్ల లలిత కుమారి విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. జడ్పీటీసీ గొర్లె బాలాజీ బాబు చదువుతో పాటు ఆటల్లోనూ రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొండా జాకోబు, ఉప సర్పంచ్ వీర బాబు, SMC చైర్మన్ బోరగా త్రిత్వ దాస్, కో ఆప్టెడ్ సభ్యులు గొర్లె అనిల్ ప్రసాద్, టీడీపీ ప్రెసిడెంట్ గురుకు శేషు కుమార్, జనసేన ప్రెసిడెంట్ మళ్ళా దుర్గ ప్రసాద్, కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్