రోడ్డు ప్రమాద బాధితుడికి ఎమ్మెల్యే చేయూత

459చూసినవారు
రోడ్డు ప్రమాద బాధితుడికి ఎమ్మెల్యే చేయూత
అల్లూరి సీతారామరాజు జిల్లా, రంపచోడవరం నియోజకవర్గం, ఎటపాక మండలం, నెల్లిపాక గ్రామానికి చెందిన వీకే శివ అనే వ్యక్తి నాలుగు రోజుల క్రితం గుండాలలో రోడ్డు ప్రమాదానికి గురై, భద్రాచలం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యానికి రెండున్నర లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో, ఆర్థికంగా వెనుకబడిన శివ కుటుంబం దాతల సహాయం కోసం ఎదురుచూసింది. ఈ విషయం తెలుసుకున్న రంపచోడవరం ఎమ్మెల్యే శ్రీమతి మిరియాల శిరీష దేవి, ఆంధ్రప్రదేశ్ సీఎం కార్యాలయానికి ఫోన్ చేసి, హైదరాబాద్‌లోని కేర్ హాస్పిటల్‌లో చికిత్స కోసం రెండున్నర లక్షల రూపాయల ఎల్ఓసీని ఇప్పించారు. వెంటనే చికిత్స ప్రారంభమైంది. ఎమ్మెల్యేకు శివ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్