రాజవొమ్మంగి మండలంలో మంగళవారం వింత వాతావరణం నెలకొంది. రోహిణి కార్తె రెండో రోజు కూడా ఎండ తీవ్రతతో ప్రజలు అల్లాడిపోయారు. వేడి గాలుల కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే, రాత్రి కురిసిన వర్షం వల్ల ఉక్కపోత నుంచి కొంత ఉపశమనం లభించింది. ఈ వింత వాతావరణం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రంపచోడవరం ప్రాంతంలో కనిపించింది.