అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం చికిలింత గ్రామానికి చెందిన గిరిజన రైతు కాకర జోగిరాజు పొలాల్లో మంగళవారం రాత్రి ఏడు ఆవు దూడలు అనుమానాస్పదంగా మృతి చెందాయి. దూడల శరీరాలపై రక్తపు మరకలు ఉన్నాయని రైతు తెలిపారు. మంగళవారం గాలులతో కూడిన వర్షం కురిసిన నేపథ్యంలో, బుధవారం ఉదయం కర్రలకు కట్టి ఉన్న ఏడు దూడలు చనిపోయి కనిపించాయి. ఒక ఆవు, ఒక దూడ కనిపించకుండా పోయాయని రైతు పేర్కొన్నారు.