రాజవొమ్మంగి మండలం వాతంగి పంచాయితీ పెద రెల్లంగి పాడు గ్రామంలో గిరిజన రైతు కాకర రామిరెడ్డి పొలాల్లో గేదె అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. గేదె మెడపై రక్తపు మరకలు కనిపించాయి. ఇదే సమీపంలోని చికిలింత పొలాల్లో గిరిజన రైతు కాకర జోగిరాజుకు చెందిన ఏడు ఆవు దూడలు కూడా ఇలాగే మృతి చెందాయి. మృతుల ధ్రువీకరణ కోసం అధికారులు విచారణ చేపట్టాల్సి ఉంది.