మారేడుమిల్లి మండలం మారెడిమిల్లి గ్రామంలోని ఆదివాసి వర్తక కేంద్రం వద్ద తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇంచార్జ్ డాక్టర్ రాజ్ కుమార్ రెడ్డి పల్లాల ఆధ్వర్యంలో మహానాడు కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ద్వీప ప్రజ్వలనతో మొదలైన ఈ కార్యక్రమంలో నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు సమర్పించారు. తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు గురుకు శేష్ కుమార్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ హైబ్రిడ్ మహానాడు కార్యక్రమం ఎల్ఈడి స్క్రీన్ ద్వారా మారేడుమిల్లి మండల నలుమూలలకూ ప్రసారం చేయబడింది. ఈ కార్యక్రమంలో అల్లూరి సీతారామరాజు, రంపచోడవరం ప్రాంత నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.