
రాజోలు: 'ఎస్సీ సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలి'
గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన ఎస్సీ సంక్షేమ పథకాలను వెంటనే పునరుద్ధరించాలని దళిత చైతన్య వేదిక నాయకులు మంగళవారం రాజోలులో డిమాండ్ చేశారు. ఇంటింటా అంబేడ్కర్ కార్యక్రమంలో భాగంగా కరపత్రాలు పంచుతూ, ఇంటి గుమ్మాలకు అంబేడ్కర్ ముఖచిత్రంతో కూడిన స్టిక్కర్లను అతికించారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఎస్సీ సంక్షేమ పథకాల అమలు బాధ్యతను విస్మరించడం సరికాదని వారు అన్నారు.

































