మల్కిపురం మండలం రామరాజులంక మెయిన్ రోడ్డు సమీపంలో ఒక పెద్ద చింతచెట్టు కొమ్మ విరిగి, ప్రమాదకరంగా కూలిపోయే స్థితిలో ఉంది. నిత్యం వాహనాలు, ప్రజలు రాకపోకలు సాగించే ఈ ప్రధాన రహదారిపై ఆ కొమ్మ ఏ క్షణంలోనైనా విరిగిపడి పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కావున, పంచాయతీ అధికారులు వెంటనే స్పందించి, ముందస్తు జాగ్రత్తగా ఆ చెట్టు కొమ్మను తొలగించి ప్రాణనష్టం జరగకుండా చూడాలని స్థానికులు బుధవారం కోరారు.