అల్లవరం మండలం గోడి గురుకుల జూనియర్ కళాశాలలో 2025–26 విద్యా సంవత్సరానికి జూనియర్ ఇంటర్ లో చేరేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు ప్రిన్సిపల్ శ్రీనివాస్ ఆదివారం తెలిపారు. బైపీసీ, ఎంపీసీ గ్రూపుల్లో చేరేందుకు ఈ నెల 15లోగా
విద్యార్థులు దరఖాస్తు చేయాలన్నారు. గురుకుల ఎంట్రన్స్ రాయకపోయిన వారు కూడా చేరేందుకు అర్హులేనని చెప్పారు.