అంతర్వేది: పింఛన్ల పంపిణీలో పాల్గొన్న టీడీపీ ఇంచార్జి

15చూసినవారు
ఎన్నికల హామీ మేరకు ప్రతి నెల ఒకటో తేదీనే లబ్ధిదారుల ఇంటి వద్దకే పింఛన్లు అందిస్తూ కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని టీడీపీ ఇన్ఛార్జ్ గొల్లపల్లి అమూల్య తెలిపారు. అంతర్వేది రాంబాగ్ లో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ ప్రజలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్