తాటిపాకలో ‘పెద్ది’ హంగామా

1చూసినవారు
రామ్ చరణ్ నటించిన 'పెద్ది' చిత్రం ప్రీమియర్ షో సందర్భంగా బుధవారం తాటిపాకలో అభిమానులు భారీ హంగామా చేశారు. థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన రామ్ చరణ్ కటౌట్‌కు హారతులు పట్టి, గుమ్మడికాయతో దిష్టి తీశారు. సినిమా ఘనవిజయం సాధించాలని ఆకాంక్షిస్తూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. నాలుగు రోడ్ల కూడలి నుంచి థియేటర్ వరకు అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించడంతో అక్కడ పండగ వాతావరణం నెలకొంది.

ట్యాగ్స్ :