రాజోలు మండలం తాటిపాకలో శుక్రవారం జరిగిన ‘మహానాడు సక్సెస్ మీట్’లో
టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గొల్లపల్లి అమూల్య మాట్లాడుతూ, ప్రతికూల వాతావరణంలోనూ మహానాడును విజయవంతం చేసిన నిర్వాహకులను అభినందించారు. మహిళా సాధికారత, రాజకీయాల్లో 33% రిజర్వేషన్లకు
టీడీపీ కట్టుబడి ఉందని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ముదునూరి చినబాబు రాజు, బందెల పద్మ, మంగెన భూదేవి తదితర నాయకులు పాల్గొన్నారు.